చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన _ TTD EO INSPECTS SITE FOR CHILDREN’S HOSPITAL


చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన
– వెంటనే కన్సల్టెంట్లను నియమించుకోవాలని ఈవో ఆదేశం

తిరుపతి 25 అక్టోబరు 2021: శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణం కోసం టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం స్థల పరిశీలన జరిపారు.

రుయా ఆసుపత్రి వెనుక వైపు గల ఖాళీ స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి స్వాధీనం చేసుకోవడానికి అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కన్సల్టెంట్లను నియమించుకుని భూమి చదును, డిజైన్ల లాంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

జేఈవో శ్రీ వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనదిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Now ButtonCall now for Cab