అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి… రేయింబ‌వళ్లు క‌ష్ట‌ప‌డ్డ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి


అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

రేయింబ‌వళ్లు క‌ష్ట‌ప‌డ్డ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల‌, 2021 నవంబరు 22: న‌వంబ‌రు 26 నుండి 30వ తేదీ వ‌ర‌కు అధిక వ‌ర్ష‌పాతం కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచిస్తోంద‌ని, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ భారీ వ‌ర్షాల స‌మ‌యంలో రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించిన అధికారులు, సిబ్బందిని ఈ సంద‌ర్భంగా అభినందించారు. అనంత‌రం భారీ వ‌ర్షం కార‌ణంగా ఘాట్ రోడ్లు, కాటేజీల వ‌ద్ద‌ జ‌రిగిన న‌ష్టంపై స‌మీక్షించారు. ఇలాంటి స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా స‌ర్వ‌ర్లు ప‌నిచేసేలా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐటి విభాగం అధికారుల‌కు సూచించారు. అధిక వ‌ర్షం కార‌ణంగా కాటేజీల్లో లీకేజీల‌ను అరిక‌ట్టాల‌ని, షార్ట్ స‌ర్క్యూట్ కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌యంలో చేరే వ‌ర్ష‌పునీటిని ఎప్ప‌టిక‌ప్పుడు తోడే ప్ర‌క్రియ జ‌ర‌గాల‌ని, అడ్డంకులు లేకుండా డ్రెయిన్ల ద్వారా నీరు వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎటిసి కార్ పార్కింగ్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 ఉద్యాన‌వ‌నం, మ్యూజియం, అద‌న‌పు ఈవో బంగ‌ళా, టిబిసి త‌దిత‌ర ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌న్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Now ButtonCall now for Cab